Saturday, May 4, 2024
- Advertisement -

ప్ర‌భాస్ భూవివాదం: షాకింగ్ తీర్పునిచ్చిన హైకోర్టు

- Advertisement -

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. హైద‌రాబాద్ రాయద‌ర్గం ప‌న్‌మ‌క్తాలోని భూముల్లో ప్ర‌భాస్‌కు ఓ ఫామ్ హౌజ్ ఉన్న‌ విష‌యం తెలిసిందే. ఇది ఈ స్థలం ప్ర‌భుత్వనిది అని , ఆ స్థ‌లంలో ప్ర‌భాస్ అక్ర‌మంగా ఫామ్ హౌజ్ క‌ట్టారని రాయద‌ర్గం రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీంతో వెంట‌నే ప్ర‌భాస్‌కు నోటీసులు జారీ చేసి అక్క‌డ నుంచి ఖాళీ చేయాలని ఆదేశించారు. దీనిపై ప్ర‌భాస్ హైకోర్టును సంప్ర‌దించారు. ప‌క్కా ఆధారాల‌తోనే ఆ స్థ‌లం కొనుగొలు చేసిన‌ట్లు ప్ర‌భాస్ త‌రుపున న్యాయ‌వాది కోర్టులో వాద‌న‌లు వినిపించారు.

ఇరు వాద‌న‌లు విన్న హైకోర్టు బుధ‌వారం ఆస‌క్తిక‌ర తీర్పుని వెలువ‌రించింది. క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా ప్ర‌భాస్‌ని గెస్‌హౌజ్ నుంచి ఖాళీ చేయించ‌డం చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని తేల్చి చెప్ప‌డంతో ప్ర‌భాస్ షాక్‌కు గుర‌య్యారు. ప్ర‌భాస్ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ కోసం వేసిన కేసుపై విచార‌ణ చేసిన హైకోర్టు ధ‌ర్మాస‌నం ఆ స్థ‌లం వివాదంలో ఉంద‌ని తేల్చి చెప్పింది. ఈ స్థ‌లాన్ని స్వాధీనం చేసుకునే విష‌యంలో రెవెన్యూ అధికారులు అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించార‌ని అధికారుల‌పై అక్షింత‌లు వేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -