Thursday, April 25, 2024
- Advertisement -

ప్రభాస్ ‘సలార్’ అర్థం చెప్పిన డైరెక్టర్!

- Advertisement -

బాహుబలి తర్వాత పాన్ ఇండియా నటుడిగా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ చిత్రం తర్వాత సుజిత్ దర్శకత్వంలో ‘సాహెూ’ తో కాస్త డీలా పడ్డాడు ప్రభాస్. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తుంది. ఇక ‘కేజీఎఫ్’ చిత్రంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘సలార్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇటీవలే ఈ చిత్రం టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.  అయితే సలార్ అంటే ప్రేక్షకుల్లో ఓ రకం సందేహాలు వచ్చాయి. ఎప్పుడూ వినని ‘సలార్’ అనే పదానికి అర్థం ఏమిటో తెలియక చాలామంది తికమకపడుతున్నారు.

ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ దీనిపై స్పందించాడు. సలార్ అన్న పదానికి ఎంతోమంది ఎన్నో రకాల అర్థాలు ఇస్తున్నారు. అయితే, అది ఒక ఉర్దూ పదం.. ఆ భాషలో సలార్ అంటే చీఫ్ కమాండర్ అని అర్థం.  రాజుకు వెన్నుదన్నుగా ఉంటూ.. రక్షకుడిగా ఉండటం అని అన్నారు. సలార్ కథకి ప్రభాస్ సరిగ్గా సరిపోతాడని నాకు అనిపించింది. అందుకే, ఆయనను ఎంచుకున్నాను అన్నారు ప్రశాంత్.  

Also Read

ప్రభాస్ వదిలేసిన పది సినిమాలు ఇవే..!

ప్రభాస్ 2025 వరకు పెళ్లి చేసుకోడట ?

అన్నయ్య మూవీతో ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ చెల్లి..!

ప్రభాస్ వదిలేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -