- Advertisement -

బాలీవుడ్‌లో హీరోయిన్లకు గౌరవం ఉండదు!

- Advertisement -

బాలీవుడ్ పై సంచలన కామెంట్స్ చేశారు హీరోయిన్ రాశీఖన్నా. బాలీవుడ్‌లో హీరోయిన్లకు గౌరవం ఉండదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. టాలీవుడ్‌లో నటీనటుల మధ్య చాలా స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది అని…. ముఖ్యంగా హీరోయిన్లకు చాలా గౌరవం ఇస్తారు అని చెప్పుకొచ్చింది. ఇక్కడ పని చేస్తుంటే ఎప్పుడూ ఒక కుటుంబంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అని ఆమె తెలిపారు.

కానీ హిందీ, తమిళ ఇండస్ట్రీల్లో రోజుకు కనీసం 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. దీని వల్ల బాగా అలసిపోతాం అన్నారు. టాలీవుడ్‌లో విశ్రాంతి సమయాలు కూడా ఇస్తారు… అందుకే నాకు టాలీవుడ్‌లో పనిచేయడం చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం రాశీ ఖన్నా నటించిన తెలుసు కదా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా ఈ నెల 17న థియేటర్లలో విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -