Monday, May 6, 2024
- Advertisement -

‘రాజు గారి గది2’ మూవీ రివ్యూ

- Advertisement -

అక్కినేని నాగార్జున, సమంత ప్రధాన పాత్రలలో నటించిన సినిమా రాజు గారి గది 2. ఓంకార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఈనెల 13న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అశ్విన్ బాబు, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. థ్రిల్లింగ్ ఎంటర్‍టైనర్ గా తెరకెకిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించారు. పివిపి, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్, ఓక్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

అశ్విన్, కిశోర్, ప్రవీణ్ ముగ్గురు మంచి ఫ్రెండ్స్. అయితే ఈ ముగ్గురు కలిసి.. ఓ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. వైజాగ్ బీచ్ లో ఉండే రాజుగారి బంగ్లా కొని అందులో రిసార్ట్ స్టార్ట్ చేస్తారు. రిసార్ట్ కు వచ్చిన సుహానిస (సీరత్ కపూర్) మీద కిశోర్, ప్రవీణ్ లు మనసు పారేసుకుంటారు. అయితే ఆమెకు దగ్గరవ్వడంకోసం ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలోనే ఆ రిసార్ట్ లో దెయ్యం ఉన్న విషయం తెలుసుకుంటారు. అయితే దెయ్యం విషయం గురించి ఫాదర్ కు చెప్తే.. ఆయన రుద్ర ( నాగార్జున) గురించి చెప్తాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ మెంటలిస్ట్ లో ఒకడైన రుద్ర, సైన్స్ గురించి ఎంత తెలిసిన మన పాత ఆచారాలను, నమ్మకాలను పాటిస్తుంటాడు. రిసార్ట్ కు చేరుకున్న రుద్ర.. అక్కడ అమృత (సమంత) అనే అమ్మాయి ఆత్మ ఉందని.. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కోసం.. ఆ ఆత్మ తిరుగుతుందని కనిపెడతాడు. అసలు ఈ అమృత ఎవరు..? ఎలా చనిపోయింది..? అమృతకు కావాల్సిన సమాదానాలు ఏంటి..? మరి చివరికి ఏం జరిగింది..? అనేది కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో సమంత తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది. రెండు వేరియేషన్స్ ను బాగా చూపించింది. ఇక నాగార్జున మెంటలిస్ట్ పాత్రలో బాగా చేశారు. మూవీలో నాగ్ డ్రెస్సింగ్ స్టైల్ నుంచి లుక్స్ పరంగా చాలా కొత్తగా కనిపిస్తాడు. వాస్తవానికి మనుషుల మనసులను అర్థం చేసుకోగల వ్యక్తిగా నాగ్ బాగా చేసాడు. నాగార్జున ఎంట్రీ నుంచి చివరి వరకు చాలా ఎంటర్‌టైనింగ్‌గా నడుస్తూనే ఒక సీరియస్ మూడ్‌ను క్రియేట్ చేస్తూ వుంటుంది. ప్రధానంగా నాగ్, సమంతల మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. నటుడిగా నాగ్ కు ఇదొక కొత్త అనుభూతి అని చెప్పుకోవచ్చు. అశ్విన్ బాబు, వెన్నెల కిషోర్, ప్రవీణ్, షకలక శంకర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సీరత్ కపూర్ తన క్యారెక్టర్లో పూర్తిగా న్యాయం చేసింది. సీరత్ యాక్టింగ్ తో పాటు ఈ అమ్మడి గ్లామర్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయింది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగా చేశారు. ‘రాజు గారి గది2’ సినిమాను మలయాళం విజయం సాధించిన ‘ప్రేతమ్’ సినిమాకు రీమేక్‌గా తీసినట్లుగా అనిపిస్తోంది. ఇక సినిమా విషయంకు వస్తే.. ఒక ఎమోషన్ మూడ్‌తో మొదలు అవుతోంది. ఆ తర్వాత కామెడీ అంశాలతో కాస్త సరదా సరదాగా సాగుతోంది. ఫస్ట్‌ హాఫ్‌లో సరదా సరదాగా సాగినా.. కింగ్ నాగార్జున ఎంట్రీతో అసలు కథ మొదలు అవుతోంది. నాగ్ కూడా సరదాగా ఉంటునే.. అక్కడ ఉన్న సమస్యను కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. సెకండ్ హాఫ్‌లో అసలు ట్విస్ట్‌ రివీల్ అవుతుంది. అందాల భామ సమంత పాత్రకు సంబంధించిన సీన్లు సినిమాను ఎమోషన్ మూడ్‌లోకి తీసుకెళ్తుంటాయి. మొత్తానికి ‘రాజుగారిగది2’ నవ్విస్తూనే థ్రిల్లింగ్‌కు గురిచేసే ఓ ఎంటర్‌టైనింగ్ చిత్రమని చెప్పుకోవచ్చు. థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయింది. థమన్ రీరికార్డింగ్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. అలాగే సినిమాటోగ్రాఫర్ దివాకరణ్ సినిమాటోగ్రఫి బాగుంది. కొన్ని కొన్ని చోట్ల విజువల్స్ అదిరిపోయాయి. గ్రాఫిక్స్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. డైలాగ్స్ బాగున్నాయి. ఇక దర్శకుడు ఓంకార్ మరోసారి దర్శకుడిగా విజయం సాధించాడని చెప్పుకోవచ్చు. స్క్రీన్‌ప్లే పరంగా అటు ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఇటు థ్రిల్లింగ్ ఎమోషన్‌ మూడ్‌ను కూడా బ్యాలెన్స్ చేస్తూ చూపించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ విషయంకు వస్తే.. ఫస్ట్ ఆఫ్ లో కొన్ని సీన్లు.. అక్కడ అక్కడ తెలిసిఫోయే సీన్లు.

మొత్తంగా :

నాగార్జున, సమంతల నటన.. అశ్విన్, కిశోర్, ప్రవీణ్ కామెడీ, కథ, కథనం మ్యూజిక్.. దర్శకుడు సినిమాని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉండగా.. సెకండాఫ్ తో పోలిస్తే.. ఫస్ట్ ఆఫ్ పెద్దగా లేకపోవడం.. అక్కడ అక్కడ సీన్లు తెలిసిపోవడం మైనస్ గా కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ సినిమా దీపావళికి ఒక థ్రిల్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ అని చెప్పవచ్చు. ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజా చేసే సినిమా ఇది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -