మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) సంబంధించిన మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఇటివలే జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం అభాసుపాలైంది. మాలో ఉన్న గొడవలను హీరో రాజశేఖర్ చర్చించడం.. అది కరెక్ట్ కాదని చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణంరాజు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ వివాదం రాజశేఖర్ రాజీనామా వరకు వెళ్లింది. అయితే మాలో అందరు సీనియర్ హీరోలే ఉన్నారు.
ఇలాంటి వ్యవహారాల్లో మన యంగ్ హీరోలు ఎక్కువగా జ్యోకం చేసుకోరు. అందుకే ఏ సమస్య అయిన మన సీనియర్ హీరోలే చూసుకుంటారు. అయితే మాలో చేలరేగిన గొడవలు పై హీరో రామ్ చరణ్ తాజాగా స్పందించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో వివాదాలను వాళ్లే పరిష్కరించుకుంటారని, సినీరంగంలో జరుగుతున్న పరిణామాలను పెద్దలు చూసుకుంటారని చరణ్ చెప్పారు.
ఆర్‌ఆర్‌ఆర్ సగానికిపైగా షూట్ అయ్యిందని.. జూలై 30న కచ్చితంగా రిలీజ్ అవుతుందని.. అలానే సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి హాజరు కావడంపై మాట్లాడుతూ.. సూపర్ స్టార్ మూవికి మెగాస్టార్ వెళ్లడం మంచి పరిణామం అని చెప్పారు. ఇక ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే అన్ని సినిమాలు సూపర్ హిట్ కావాలని కోరుకున్నాడు చరణ్.
