టాలీవుడ్ యంగ్ హీరోలలో నితిన్ కూడా ఒకడు. ఈ మధ్య వరుస ఫ్లాప్‌లతో తెగ ఇబ్బంది పడుతున్నాడు నితిన్. ‘లై’, ‘ఛల్ మోహన రంగ’, ‘శ్రీనివాసకళ్యాణం’ ఇలా వరుస ఫ్లాప్‌లను నితిన్‌ను పలకరించాయి. నితిన్‌కు అర్జెంట్‌గా హిట్ కావాలి. అందుకే ‘ఛలో’తో హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ కుడుములతో భీష్మ అనే చేయడానికి రెడీ అయ్యాడు. కథ సిద్దం అయినప్పటికి సినిమా మాత్రం సెట్స్ మీదకు వెళ్లడం లేదు. అయితే దీనికి కారణం నితిన్ అని సమాచారం. నితిన్‌కు వరుస ఫ్లాప్‌లు రావడంతో ఈ హీరో మార్కెట్ కాస్తా తగ్గింది. పారితోషకం కాస్తా తగ్గించికోమని నిర్మాతలు నితిన్‌ను కోరుతున్నారట.
దీనికి నితిన్ ససేమిరా అనడంతోనే సినిమా మొదలు కాలేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందనాను తీసుకున్నారు. తనకు ఛలో వంటి సినిమాతో తెలుగులో మొదటి హిట్ ఇచ్చిన దర్శకుడు కావడంతో నితిన్ భీష్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సినిమా ఆలస్యం కావడంతో భీష్మ నుంచి రష్మిక తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. పైగా ఇదే సమయంలో ఆమెకు అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. దీంతోనే ఆమె నితిన్ సినిమా నుంచి తప్పుకుని బన్ని సినిమా చేయడానికి రెడీ అయిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
