మనోజ్‌ వాజ్‌పాయి ని తెగ మెచ్చుకున్న వర్మ

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఎప్పుడు ఎవరిని పొగుడుతాడో.. పొగడ‍్తల వంకతో తిడతాడో ఎవరికీ అర్థం కాదు. సినిమా, రాజకీయం, క్రీడారంగం ఏ ఒక్కరినీ వదలరు.. తన ట్విట్ తో ఎప్పుడూ సంచలనాలు సృష్టిస్తూనే ఉంటారు. అలాంటిది ఫ్యామిలీమ్యాన్‌ 2 పై మనస్ఫూర్తిగా ప్రశంసల వర్షం కురిపిస్తూ ఓ ట్వీట్‌ చేశాడు ఆర్జీవీ. రియలిస్టిక్‌ జేమ్స్‌ బాండ్‌ ఫ్రాంఛైజీ తన సత్తా చాటడానికి ఫ్యామిలీమ్యాన్‌ 2 మంచి అవకాశం ఇచ్చిందన్నారు.

అలాగే ఫ్యామిలీ డ్రామా, యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కలగలిసి ఉందని, ఫ్యామిలీమ్యాన్‌ను రియలిస్టిక్‌గా, డ్రమటిక్‌గా గొప్పనటుడుగా గ్రేట్ పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు అంటూ.. మనోజ్‌ వాజ్‌పాయి పై ప్రశంసలు గుప్పించాడు. ఇక వర్మ తీసిన సత్య(1998) మూవీతోనే మనోజ్‌ వాజ్‌పాయికి నేషనల్‌ అవార్డు(సపోర్టింగ్‌)తో పాటు మంచి గుర్తింపు కూడా దక్కింది.

- Advertisement -

అప్పటి నుంచి వర్మ, మనోజ్ వాజ్ పాయి కి మద్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజ్‌ అండ్‌ డీకేలు డైరెక్ట్ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌ వెబ్‌ సిరీస్‌ ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వివాదాల నడుమే స్ట్రీమ్ అయ్యి సూపర్‌హిట్‌ టాక్‌ దక్కించుకుంది. ఈ వెబ్ సీరీస్ తో సమంత కూడా మంచి పేరు తెచ్చుకుంది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -