Monday, May 13, 2024
- Advertisement -

రన్‌ మూవీ రివ్యూ

- Advertisement -

తెలుగు సినిమాలో కాస్త వైవిధ్యమైన సినిమాలు తీస్తూ వాటికి మంచి కథాంశాలు జత చెయ్యడం సందీప్ కిషన్ కి బాగా అలవాటు. కానీ వాటిల్లోంచి హిట్ శాతం మాత్రం చాలా తక్కువగా పొందుతూ ఉంటాడు ఈ హీరో. ఈ సరి అనిల్ కంగేటి తో సందీప్ చేసిన ప్రయోగం ఎలా ఉందొ చూద్దాం. ఇది మలయాళం సినిమా నేరం కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

సందీప్ కిషన్ కంటే ముందుగా ఈ సినిమా లో డిస్కస్ చెయ్యాల్సిన క్యారెక్టర్ వడ్డీ రాజా (బాబీ సింహా) ది. నారా రూప రాక్షసుడు లాగా ఉండే ఈ క్యారెక్టర్ వడ్డీ కోసం ఎంత దారుణానికైనా తెగించే రకం. ఉద్యోగం లేకుండా తిరిగే సందీప్ బాబీ దగ్గర తనకి చాలా అర్జెంట్ అయ్యి కొంత సొమ్ము తీసుకుంటాడు. ఆ డబ్బు ఎవరో దొంగ ఊహించని రీతిలో కొట్టేస్తాడు , అక్కడ మొదలవుతుంది అసలు కథ.

ఈ లోగా సందీప్ కి అన్ని కష్టాలూ మొదలు అవుతాయి. ఎన్నో సంవత్సాల నుంచీ ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. నిజానికి ఆమెతో వెల్లిపోదాం ఇంట్లోంచి అని అని అడిగినప్పుడు ఒద్దు అనే ఆమె సడన్ గా మాయం అవ్వడం తో హీరోయిన్ సురభి తండ్రి హీరో మీద పోలీస్ కేసు పెడతాడు. ఈ దెబ్బతో సబ్ ఇన్స్పెక్టర్ కూడా హీరో వెంట పడతాడు . చాలా తక్కువ సమయం లో ఒక్కొక్క సమస్య నీ సాల్వ్ చేసుకుంటూ హీరో చివరకి తన డబ్బునీ, లవర్ నీ ఎలా ఫైండ్ అవుట్ చేసాడు అనేది ఈ సినిమా కథ.

సందీప్ ఇదివరకు మీద చాలా చక్కగా ఇంప్రూవ్ అయ్యాడు అని చెప్పాలి. తరవాత బాబీ సింహా – వడ్డీ రాజా పాత్రలో ఆదరగోట్టేసాడు అసలు. సమయం యొక్క ముఖ్యత ని ఈ సినిమాలో చాలా పర్ఫెక్ట్ గా చూపించారు అని చెప్పాలి. హీరోయిన్ గ్లామర్ కూడా యాడ్ అయ్యింది అక్కడక్కడ. ఫస్ట్ హాఫ్ కామెడీ తో బాగుంది , సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలు అయ్యి చివరికి ఒచ్చే సరికి సూపర్ ఫీల్ ని ఇస్తుంది . నిడివి తక్కువగా ఉండడం ఈ సినిమాకి పెద్ద పాజిటివ్ పాయింట్ . 

లీడ్ కపుల్ మధ్యక కెమిస్ట్రీ కాస్త తగ్గింది అని చెప్పచ్చు. అక్కడక్కడా కాస్తే వైలెన్స్ పాళ్ళు ఎక్కువ అయ్యాయి. కొన్ని చోట్ల స్లో పేస్ అనిపిస్తుంది సినిమా. లాజిక్ లు మిస్ అయిన సీన్ లు కూడా లేకపోలేదు. పోసాని కామెడీ పేలలేదు 

మొత్తంగా ::

మలయాళం చిత్రమైన నేరం కి ఈ తెలుగు రన్ పర్ఫెక్ట్ రీమేక్ అని చెప్పచ్చు. ఈ సినిమా ఆద్యంతం ఆసక్తి గా సాగుతూ , క్లైమాక్స్ కి చేరుకునే సరికి ఒక్కొక్క ట్విస్ట్ బయటపడి పోతూ ఇంటర్స్ట్ పోకుండా సాగింది. ఫస్ట్ హాఫ్ ని మానేజ్ చెయ్యగలిగితే సెకండ్ హాఫ్ అదిరిపోతుంది అనడం లో డౌట్ లేదు. రీమేక్ ని చడగోట్టకుండా మన నేటివిటీ ని సరిగ్గా ఇరికించి మరీ తీసారు ఈ సినిమాని. బాబీ సింహా – సందీప్ ల మధ్య సీన్ లు బాగున్నాయి. ఈ వీక్ ఎండ్ లో ఒక ఆసక్తికర సినిమాని చూడాలి అనుకుంటే తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -