అందమైన హావభావాలతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది ప్రియా ప్రకాశ్ వారియర్. అప్పటినుంచి ఆమెకు అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు. ఆమె తొలిచిత్రం ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలో మాణిక్య మలరాయ పోవు’ పాటకుగానూ ఆమె ప్రదర్శించిన అభినయాన్ని ఎవరూ మరిచిపోలేరు. కేవలం 30 సెకన్ల వీడియోతో జీవిత కాలానికి సరిపడా ఇమేజ్‌ను సంపాదించుకుంది.
ఈమె అభినయానికి దేశంలోనే కాకుండా లుంగీ ఎంగిడి వంటి విదేశీ క్రికెటర్లు కూడా ఫిదా అయ్యారు. రాజ్‌కపూర్ వంటి సినీ దిగ్గజాలను కూడా ఆమె క్యూట్ హావభావలతో మెప్పించింది. ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం ఆ స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేసే పనిలో ఉంది.
తాజాగా ప్రియా వారియర్ క్రికెట్ దిగ్గజం సచిన్‌తో కలసి సందడిచేసింది. చిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఐఎస్‌ఎల్-2018కు మార్చి 1న విడుదల కానున్న ‘ఒరు అదార్ లవ్’ సినిమా ప్రమోషన్ నిమిత్తం సహనటుడు రోషన్ అబ్దుల్ రహూఫ్ తో కలిసి ప్రియా వారియర్ హాజరైంది. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ లను కలిసింది. వారిని కలిసిన విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది.
కొచ్చికి రావడం వల్ల తాను ఇద్దరు గొప్ప వ్యక్తులను కలుసుకున్నానని, చాలా సంతోషంగా ఉందని తెలిపింది. కాగా, ‘ఒరు అదార్ లవ్’ సినిమాలో ‘మాణిక్య మలరాయ పోవు’ పాటలో భాగంగా ఆమె పలికించిన హావభావాలు యువతరానికి హత్తుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ గా మారింది.
