టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ పేరిట మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గళమెత్తి సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి…సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.నటుడు శివబాలాజీ కూడా శ్రీరెడ్డికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్‌ను దూషించినందుకు శ్రీరెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు.ఈ పరిణామాలు ఇలా ఉండగా తాజాగా శ్రీరెడ్డి పవన్ అభిమానులను హెచ్చరిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. తన ఫేస్‌బుక్ పేజీ పోలీసుల నిఘాలో ఉందని, బెదిరించేవాళ్లు, ట్రోలింగ్ చేసేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఆమె పోస్టు చేశారు.
‘నా ఫేస్‌బుక్ పేజీ పోలీసుల నిఘాలో ఉంది. కాబట్టి జాగ్రత్త. వ్యక్తులను బ్లాక్ చేయడాన్ని నేను ఆపేశాను. పవన్ అభిమానులు ఎంతగా బెదిరిస్తున్నారో.. ట్రోల్ చేస్తున్నారో అందరికీ చూపించాలని మేం అనుకుంటున్నాం. జాతీయ మానవహక్కుల కమిషన్ మాకు మద్దతుగా ఉందని దమ్ముంటే ఇప్పుడు చేయండి బ్యాడ్ కామెంట్స్ అంటు వెటకారంగా మాట్లాడింది. అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మరో పోస్టులో ఆమె పేర్కొన్నారు.

