ఈ రోజు నటుడు జనసేన అధ్యక్షుడు కుమార్తే ఆద్య పట్టిన రోజు.పవన్ కళ్యాణ్ ,రేణుదేశాయ్‌కు పుట్టింది ఆద్య.ఈ సందర్భంగా పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పవన్‌కు ఆద్య అంటే చాలా ఇష్టం.ఆడపిల్ల కావడంతో ఆ ఇష్టం మరింత ఎక్కువైంది.పవన్ రేణుదేశాయ్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.పవన్ రేణుదేశాయ్ దంపతలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పవన్‌కు పిల్లలంటే చాలా ఇష్టం ఈ విషయన్ని స్వయంగా రేణుదేశాయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. గతేడాది ఆమె పాఠశాలకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పిన పవన్ ఈ సంవత్సరం మాత్రం ఏం చేస్తాడో చూడాలి.ప్రస్తుతం రేణుదేశాయ్ పూణేలో ఉంటున్నారు. పిల్లలు కూడా ఆమె దగ్గరే ఉంటున్నారు.పవన్ రేణుదేశాయ్‌కు విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్న సంగతి మనందరికి తెలిసిందే.
