Sunday, May 12, 2024
- Advertisement -

తెలుగు ఆభ‌ర‌ణాలు.. హ‌ఠ‌న్మర‌ణాలు

- Advertisement -

తెలుగు తెర నుంచి ఇత‌ర సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కు వెళ్లిన హీరోయిన్లు ఎంత‌మందో. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ అందాల‌ను ఆరాధిస్తుంది.. అవ‌కాశాల‌ను అందిస్తుంది. వారికి అగ్ర‌పీఠం అందించ‌గా వారూ మాత్రం ప్రేక్ష‌కాభిమానుల‌ను నిరాశ‌లో ముంచెత్తి వెళ్లిపోతుంటారు. ఇది ద‌శాబ్దాలుగా జ‌రుగుతోంది. తెలుగులో ఆభ‌ర‌ణాలుగా ఉన్న అందాల హీరోయిన్లు హ‌ఠ‌న్మ‌ర‌ణాలు పొంద‌డం అంద‌రినీ క‌ల‌చివేస్తోంది. వారి మ‌ర‌ణాలు ప్రేక్ష‌కాభిమానుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. ఇప్పుడు శ్రీదేవి మ‌ర‌ణం పొంద‌డం కూడా అలాంటిదే.

బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో సావిత్రి తిరుగులేని స్టార్ హీరోయిన్. ఆమె అందం.. అభిన‌యం చెర‌గ‌ని ముద్ర‌. తెలుగులో తొలి అగ్ర తార‌గా ఆమె వెలుగొందారు. వంద‌ల సినిమాల్లో న‌టించి తెలుగు, క‌న్న‌డ, త‌మిళ్‌ సినిమాల్లో న‌టించి చివ‌రికి అర్ధంత‌రంగా వెళ్లిపోయారు. ఆమె త‌న జీవితం చివ‌రి రోజుల్లో చాలా క‌ష్టాలు ఎదుర్కొన్నారు. కళ్లతోనే అభినయించగలిగిన గొప్ప నటి అర్ధాంత‌రంగా ప్రేక్ష‌కాభిమానుల‌ను వ‌దిలేసి వెళ్లిపోయారు. మహానటిగా కీర్తి గ‌డించిన ఆమె, వెండితెరపై మహారాణిలా వెలిగిన సావిత్రి చివరి రోజులు దయనీయంగా గ‌డిచి 47 సంవత్సరాల చిన్న వ‌య‌సులో త‌నువు చాలించారు.

నిన్నటి తరంలో సావిత్రి వారసురాలిగా గుర్తింపు తెచ్చుకున్న నటి సౌందర్య. ఆమె సమ్మోహన సౌందర్యం.. అద్భుతమైన అభినయం దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌ను చేశాయి. దశాబ్దకాలంపైగా ఆమె టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. టాప్ హీరోయిన్‌గా న‌టిస్తున్న స‌మ‌యంలోనే సౌంద‌ర్య హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెంద‌డం అంద‌రినీ ఏడిపించేసింది. 34 ఏళ్ల వ‌య‌సులో హ‌ఠాత్తుగా చ‌నిపోవ‌డం సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదంలో ముంచెత్తింది.

ఆమె తరవాత అంత‌టి పేరు ప్ర‌ఖ్యాతులు పొందిన అతిలోక సుంద‌రి శ్రీదేవి. పదహారేళ్ల వయసు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 300 సినిమాల్లో న‌టించి మెప్పించిన ఆమె హ‌ఠ‌న్మ‌ర‌ణం పొందారు. ఈ విష‌యం టాలీవుడ్‌ను క‌లచివేస్తోంది. ఆమె అందాన్ని ఆరాధించని ప్రేక్షకులు లేరు. కుటుంబ స‌మ‌స్య‌లు.. ఆర్థిక స‌మ‌స్య‌లు ఇలా ఏ స‌మ‌స్య‌లు ఉన్నా కానీ ఆమె ఇలా మ‌ర‌ణించ‌డం అంద‌రికీ షాక్ గురి చేసే విష‌య‌మే.

సావిత్రి.. శ్రీదేవి.. సౌందర్య ఈ ముగ్గురూ తెలుగు సినిమాకు ఆభరణాల్లాంటి వారు తెలుగు సినిమాలో అగ్ర తార‌లుగా వెలుగొందిన వీళ్లు అర్థాంత‌రంగా ప్రేక్ష‌కుల‌కు దూరంగా వెళ్లిపోయారు. వీరి మ‌ర‌ణం మిస్ట‌రీగా నిలిచాయి. అలాంటి న‌టీమ‌ణులు ఇప్పుడు ఎవ‌రూ రాలేరు. వారి న‌ట‌న ఎవ‌రికీ రాదు. వారి లేని లోటు ఎవ‌రూ పూడ్చ‌లేరు. వెండితెర‌పై వెలిగే హీరోయిన్ల జీవితంలో విషాద గాధ‌లు ఉంటాయి. వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్నో క‌ష్టాలు ఉంటాయి. వాళ్లు మ‌నుషులే క‌దా! వారి జీవితంలో ఏమీ జ‌రిగిందో ఎవ‌రికీ తెలుసు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -