ఎన్నికల షెడ్యుల్ విడుదల కాగానే అన్ని పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఏపీలో అయితే పార్టీల హడావిడి కాస్తా ఎక్కువైందనే చెప్పాలి. అధికార టీడీపీ పార్టీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు గెలవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితులలో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది వైసీపీ పార్టీ. 2014 జరిగిన ఎన్నికలలో 1% కన్నా తక్కువ శాతం ఓట్లు తక్కువ రావడంతో వైసీపీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఈసారి అలాంటి పొరపాటు జరగకూడదని భావిస్తున్నాడు వైసీపీ అధినేత జగన్. దీనిలో భాగంగానే వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాడు. టీడీపీకి మొదటి నుంచి సినీ గ్లామర్ ఎక్కువే. తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ చరీష్మా మీదనే పార్టీ నడుస్తోంది. బాలయ్య, జూ ఎన్టీఆర్,కల్యాణ్ రామ్ వంటి వారితోపాటు దర్శక – నిర్మాతలు చాలామంది టీడీపీకి మొదటి నుంచి అండగా ఉన్నారు.
అయితే సినీ గ్లామర్ విషయంలో మొదటి నుంచి వైసీపీ కాస్తా బలహీనంగానే ఉంది. ఒక్క ఎమ్మెల్యే రోజా తప్ప సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఎవ్వరు పెద్దగా వైసీపీలో లేరు. ఈ ఎన్నికలలో ఆ దిశగా ఆలోచించిన వైసీపీ అధినేత సినిమా వాళ్లను పార్టీలో చేర్చుకుంటున్నారు. మొన్నటికి మొన్న అక్కినేని నాగర్జున జగన్‌ను కలిసి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. జయసుధ,మంచు ఫ్యామిలీ, కమెడియన్ పృథ్వీ, ఆలీ , పూరి జగన్నాథ్ వంటి వారిని చేర్చుకుని పార్టీలో సినీ గ్లామర్ పెంచే పనిలో పడ్డారు జగన్. మొత్తనికి టీడీపీకి తగినట్లుగానే వైసీపీ కూడా సినిమా వాళ్లకు అధిక ప్రాధన్యతనిస్తోంది. మరి సినీ గ్లామర్‌ను వినియోగించుకుని ఎవరు అధికారంలో వస్తారో చూడాలి.
- Advertisement -
వైసీపీలోకి క్యూ కడుతున్న సినిమా ఇండస్ట్రీ
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -
