దివంగత నేత ,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మళయాళ సూపర్ స్టార్ మమ్మూట్టి నటిస్తున్నారు.ఈ సినిమా టాకీ పార్ట్ దాదాపు 90శాతం పూర్తయింది. ఇంక కొద్దిగా పాదయాత్ర సీన్లు బకాయి వున్నాయి. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
వైఎస్ వర్థంతి సందర్భంగా ఓ సాంగ్ బిట్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.మమ్ముట్టి ని వైఎస్ గెటప్‌లో చూపిస్తూ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.ఇప్పుడు ఈ సమరశంఖం పాట ఏమాత్రం ఎమోషనల్ గా, ఎగ్రెసివ్ గా కనెక్ట్ అయినా, దీన్ని జనాల్లోకి తీసుకెళ్లిపోతారు వైఎస్ఆర్ అభిమానులు.మహి వి రాఘవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
