ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం జాంబిరెడ్డి. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం వినోదం, థ్రిల్ల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అందరి దృష్టి దాని సీక్వెల్ ‘జాంబీ రెడ్డి 2’పై ఉంది.
ఇటీవల పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ… తేజ సజ్జతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించగా ఇది జాంంబీరెడ్డి 2 కోసమేననే ప్రచారం జరుగుతోంది. అయితే దర్శకుడు మాత్రం మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ వర్మ స్థానంలో మరో దర్శకుడు ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారని టాక్ నడుస్తోంది. ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌కు కథను అందించారు. ఈసారి కథ మరింత వైల్డ్‌గా, భారీ స్థాయిలో, మరింత థ్రిల్లింగ్‌గా ఉండబోతుందని చెబుతున్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.
