రేణిగుంట పట్టణంలో నడ్డిరోడ్డుపై ఓ యువకుడు హల్‌చల్ సృష్టించిన ఘటన కలకలం రేపింది. అంబేద్కర్ సర్కిల్ వద్ద ఓ యువకుడు కత్తితో తన గొంతు కోసుకోవడంతో స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సాయంత్రం వేళ రద్దీగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని ప్రథమ చికిత్స అందించి సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. సంఘటన స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
యువకుడు ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డాడు? అతని వ్యక్తిగత సమస్యలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో అంబేద్కర్ సర్కిల్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
