- Advertisement -

బ్లేడుతో భార్య గొంతు కోసి పరారైన భర్త

- Advertisement -

ఏలూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని సజ్జయపురంలో ఓ వ్యక్తి తన భార్య గొంతును బ్లేడుతో కోసి పరారైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సమాచారం ప్రకారం, సజ్జాపురానికి చెందిన దిల్లేశ్వరి మరియు గోవిందు భార్యాభర్తలు. అయితే కుటుంబ మనస్పర్ధల కారణంగా గత కొంతకాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. దిల్లేశ్వరి స్థానికంగా ఒక షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది.

ఈ నేపథ్యంలో గోవిందు ఆమె పనిచేస్తున్న షాపు దగ్గరకు వచ్చి తనను బండిపై ఇంటికి తీసుకెళ్లాలని కోరినట్లు సమాచారం. దీంతో దిల్లేశ్వరి బైక్ నడుపుతూ అతడిని తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

బైక్‌ను దిల్లేశ్వరి నడుపుతుండగా వెనుక కూర్చున్న గోవిందు అకస్మాత్తుగా బ్లేడుతో ఆమె గొంతును కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన దిల్లేశ్వరి వెంటనే సహాయం కోరగా స్థానికులు స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు గోవిందు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ దాడి జరిగిందని ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -