- Advertisement -

తల్లి ప్రైవేట్ ఫొటోలు..ప్రియుడికి, కూతురు షాక్!

- Advertisement -

ప్రియుడి మోజులో పడి ఓ యువతి చేసిన ఘాతుకం కన్నతల్లిని షాక్‌కు గురి చేసింది. కర్ణాటకలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం… బెంగళూరుకు చెందిన 23 ఏళ్ల యువతి డిగ్రీ చదువుతోంది. చదువుల కోసం స్మార్ట్ ఫోన్ అవసరమని చెప్పడంతో నెల రోజుల క్రితం తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ కొనిచ్చారు. అయితే చదువుపై దృష్టి పెట్టాల్సిన ఆమె, గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని తల్లి గమనించింది.

దీంతో అనుమానం వచ్చిన తల్లి ఫోన్ తీసుకుని పరిశీలించగా, అందులో తన ప్రైవేట్ ఫొటోలు మాత్రమే కాకుండా మరో బంధువుకు సంబంధించిన వ్యక్తిగత ఫొటోలు కూడా కనిపించాయి. ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆమె, ఈ ఫొటోల గురించి కూతురిని నిలదీసింది. విచారణలో, యువతి అనుమతి లేకుండా తల్లి ప్రైవేట్ ఫొటోలు తీసి, వాటిని తన ప్రియుడికి పంపినట్లు వెల్లడైంది. అంతేకాదు, కుటుంబానికి తెలియకుండా అతడిని వివాహం చేసుకున్నానని కూడా చెప్పడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఈ ఘటనపై తల్లి వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కూతురితో పాటు ఆమె ప్రియుడిపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో, “నా అనుమతి లేకుండా నా ప్రైవేట్ ఫొటోలు తీసి, వాటిని ఇతరులకు పంపింది” అని పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి స్మార్ట్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

ఈ విషయంపై ఓ సీనియర్ పోలీస్ అధికారి స్పందిస్తూ, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి నిజాలు బయటపడతాయని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -