- Advertisement -

మంగ్లీ కేసులో హైడ్రామా..పీఎస్‌కు తాగొచ్చిన అడ్వకేట్!

- Advertisement -

ప్రముఖ సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ అడ్వకేట్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫిర్యాదుదారుడైన లాయర్ మద్యం తాగి స్టేషన్‌కు వచ్చారంటూ పోలీసులు అతనికి ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించడం కలకలం రేపింది.

సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే, అతను మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానించిన పోలీసులు వెంటనే బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించారు.

ఈ పరీక్షలో 27 పాయింట్ల రీడింగ్ నమోదైంది. దీంతో అతను మద్యం సేవించి పోలీస్ స్టేషన్‌కు వచ్చారని పోలీసులు నిర్ధారించారు.పోలీసుల తీరుపై సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను రాత్రి మద్యం తాగాను.. ఇప్పుడు టెస్ట్ చేయడం ఏంటి? ..మంగ్లీపై నేను ఇచ్చిన ఫిర్యాదును పక్కదారి పట్టించేందుకే పోలీసులు ఇలాంటి డైవర్షన్లు చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.

ఈ వివాదంపై సింగర్ మంగ్లీ భావోద్వేగంతో స్పందించారు. అడ్వకేట్ సుబ్బారావు తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని చెబుతూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
అడ్వకేట్ సుబ్బారావు పెట్టిన కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అతను కేవలం సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి, రాబోయే బిగ్ బాస్ షోకి వెళ్లడానికి కావాలనే నాపై తప్పుడు కేసులు పెడుతున్నాడు” అని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కొందరు కావాలనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -