Saturday, April 20, 2024
- Advertisement -

గుజరాత్‌లోని కొవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 18 మంది రోగుల సజీవ దహనం!

- Advertisement -

దేశంతో గత కొన్ని రోజులుగా వరుసగా కరోనా కేసులు పెరిగిపోవడం.. జనాలు పిట్టల్లా రాలిపోవడం చూస్తున్నాం. ఇది చాలదు అన్నట్టు ఈ మద్య కోవిడ్ ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా గుజరాత్‌లో రాష్ట్రంలోని భారుచ్‌లోని కొవిడ్‌ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదంలో18 మంది మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 50 మందికిపైగా కరోనా రోగులను స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భరూచ్ ఎస్పీ తెలిపారు. భరూచ్-జంబూసర్ జాతీయ రహదారిపై ఉన్న ఈ వెల్పేర్ ఆసుపత్రిని ఓ ట్రస్టు నిర్వహిస్తోంది.

నాలుగు అంతస్తులున్న ఈ ఆసుపత్రిలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక అధికారులు తెలిపారు. అయితే మంటలు చెలరేగడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. పదే పదే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వాలు మాత్రం అలసత్వాన్ని మాత్రం వీడటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు.

విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షలు : సీఎం జగన్

ప్రైవేట్ ఆసుపత్రులకి టీకా పంపిణీ బంద్ టీ సర్కార్ సంచలన నిర్ణయం!

పది, ఇంటర్ పరీక్షలపై ఏపి ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచన

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -