Friday, May 3, 2024
- Advertisement -

ప్రైవేట్ ఆసుపత్రులకి టీకా పంపిణీ బంద్ టీ సర్కార్ సంచలన నిర్ణయం!

- Advertisement -

కొవిడ్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీకా తీసుకోవాలనుకునే ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. 45ఏళ్లు పై బడిన వారు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హాస్పిటల్స్ ఎక్కడైనా వ్యాక్సిన్ వేయించుకోండి అని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ ఇది ఆచరణలో ఇబ్బంది అవుతుంది. ఇదిలా ఉంటే.. ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా వైరస్ వాక్సిన్ పంపిణీ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలిపి వేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం లోని ప్రైవేట్ ఆసుపత్రులకి వాక్సిన్ డోస్ లను నిలిపి వేయాలని డీఎంహెచ్ఓ లకు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు అయిన డాక్టర్ శ్రీనివాస్ ఆదేశాలను జారీ చేశారు.

అంతేకాకుండా వారి వద్ద మిగిలి ఉన్న డోసులను కూడా కలెక్ట్ చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో వ్యాక్సిన్ సెంటర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. జిల్లాలో మొత్తం 138 సెంటర్లలో వ్యాక్సిన్ అందజేస్తుండగా గత కొన్ని రోజులుగా చాలా కేంద్రాలు మూతపడ్డాయి.

ఇప్పటి వరకూ కూడా ఉన్నటువంటి డోసులను వినియోగించుకోవచ్చు అని డీ హెచ్ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. అయితే వినియోగించగా మిగిలిన టీకాలను సేకరించాలి అని సిసిపి వైద్యాధికారులు, ఫార్మసిస్ట్ లకు డీ హెచ్ ఆదేశాలను జారీ చేశారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం తో ప్రజలు కొంత ఆందోళన చెందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పది, ఇంటర్ పరీక్షలపై ఏపి ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచన

ఎన్టీఆర్ రండి గెలుద్దాం అంటూ వెనకడుగు.. నిరాశలో అభిమానులు!

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కరోనా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -