రన్నింగ్‌ బస్సులో మంటలు .. రెప్పపాటులో..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు బోల్తా పడి 10 మంది మృతి చెందిన సంఘటన జరిగి 24 గంటలు కూడా గడవకముందే మరో బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌ నుంచి ఒంగోలులోని చీరాలకు వెళుతున్న ఓ ప్రేవేటు ట్రావెల్‌ బస్సు రన్నింగ్‌లో ఉండగా అగ్ని ప్రమాదానికి గురైంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

రెప్ప పాటులో మంటలు ఎగిసి పడడంతో ఏం జరుగుతోందో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. బస్సు డ్రైవర్‌ ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో వేగంగా కిందికి దిగారు. మరికొందరు కిటికీలోంచి కిందికి దూకారు. కాగా రెప్పపాటులో బస్సు కాలి బూడిద అయిపోయింది.

- Advertisement -

తెల్లవారు జామున ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. డ్రైవర్‌ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కాగా షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు.

కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న.. ఒమైక్రాన్‌ సోకుతుందా ?

కొత్త ఫీచర్‌తో వస్తున్న వాట్సాప్!

ఒమైక్రాన్‌ టీకాలు లభించేనా ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -