Friday, May 3, 2024
- Advertisement -

విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షలు : సీఎం జగన్

- Advertisement -

రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై రాద్ధాంతం కొనసాగుతుండగానే సీఎం జగన్మోహన్ రెడ్డి పరీక్షలు నిర్వహించి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు గురించి తనకన్నా ఎక్కువ ఆలోచించేవారు ఎవరూ ఉండరన్నారు. వారి కోసం పలు పథకాలు అమలుచేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

శుక్రవారం ఈ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరుగగా ఈ సందర్భంగా కోర్టు ప్రభుత్వం పున:పరిశీలన చేసుకోవాలని సూచించింది. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు.. పరీక్షల్లో భాగం కావాల్సి ఉందని, అందుకే పునరాలోచించుకోవాలని కోరింది. కేసు విచారణను హైకోర్టు మే 3వ తేదీకి వాయిదా వేసిన కోర్టు అదే రోజు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని ఆదేశిస్తూ మే 2లోపు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తు కోసమే పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ తెలిపారు. పరీక్షల నిర్వహణ విషయంలో కేంద్రం ఎలాంటి విధానం ప్రకటించలేదని.. రాష్ట్రాలకే నిర్ణయాన్ని వదిలేసిందని చెప్పిన సీఎం మన విద్యార్థుల భవిష్యత్ కోసమే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. నిన్ననే కేరళలో పరీక్షలు పూర్తిచేశారని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -