Friday, May 3, 2024
- Advertisement -

పది, ఇంటర్ పరీక్షలపై ఏపి ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచన

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతిపక్షాలు, విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షలు వాయిదా వేయడమో రద్దు చేయడమో చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతుండంటో ఈ వివాదం హైకోర్టుకు చేరింది. మరోవైపు విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహించి తీరాలని, అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. హైకోర్టులో పరీక్షల విషయంపై దాఖలైన పలు పిటిషన్ లను విచారణకు స్వీకరించిన హైకోర్టు కీలక సూచనలు చేసింది. తదుపరి విచారణను మే మూడవ తేదీకి వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కరోనా వైరస్ ప్రబలి పోతున్న నేపథ్యంలో పరీక్షలపై పునారాలోచించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. 30 లక్షల మంది విద్యార్థుల జీవితానికి సంబంధించిన అంశంలో పునఃపరిశీలన చేసుకోవాలని పేర్కొంది.

కోవిడ్ సోకిన వారు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఐసోలేషన్ లేదా ఆసుపత్రిలో ఉండాలని హైకోర్టు పేర్కొన్నది. అయితే కరోనా సోకిన విద్యార్థులకు ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహిస్తామని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇతర రాష్ట్రాలతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డులు కూడా పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేస్తూ ఏపి ప్రభుత్వం కూడా పరీక్షల విషయంలో పునరాలోచన చేయాలని సూచించింది.

ఎన్టీఆర్ రండి గెలుద్దాం అంటూ వెనకడుగు.. నిరాశలో అభిమానులు!

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కరోనా

బన్నీ కథలో ఎన్టీఆర్.. మరోసారి స్టూడెంట్ పాత్రలో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -