- Advertisement -

దారుణం..భార్యను చంపిన మాజీ భర్త!

- Advertisement -

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో తన మాజీ భార్యను ఓ వ్యక్తి హత్య చేసిన సంఘటన కలకలం రేపుతోంది.

మహేశ్ అనే వ్యక్తి తన మాజీ భార్య సునీతను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ తగాదాల కారణంగా సునీత ఇటీవలే మహేశ్‌కు విడాకులు ఇచ్చి వేరొకరిని వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే మహేశ్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడు మహేశ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -