- Advertisement -

హైదరాబాద్‌లో నకిలీ టీ పౌడర్ కలకలం

- Advertisement -

హైదరాబాద్ నగరంలో నకిలీ టీ పౌడర్ తయారీ వ్యవహారం కలకలం రేపింది. వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఈ అక్రమ కార్యకలాపం వెలుగులోకి వచ్చింది. జగన్నాథ్ బిష్ణోయ్ అనే వ్యక్తి సింథటిక్ రసాయనాలు మరియు నాణ్యత లేని పదార్థాలతో టీ పౌడర్ తయారుచేస్తూ పోలీసులకు చిక్కాడు.

దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, ఒక కిలో కల్తీ టీ పొడిని తయారు చేయడానికి 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్, 500 గ్రాముల నాణ్యత లేని టీ గ్రాన్యూల్స్ ఉపయోగించేవాడు. అదనంగా 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్ మిశ్రమాన్ని జోడించి అసలైన టీలా కనిపించేలా తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఈ మిశ్రమాన్ని ప్రసిద్ధ బ్రాండ్ల మాదిరిగా ప్యాక్ చేసి మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధం చేసినట్టు సమాచారం.

ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలు కలిపి తయారు చేసిన ఈ టీ పౌడర్ వినియోగదారుల ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పెద్ద ఎత్తున నకిలీ సరుకును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడు జగన్నాథ్ బిష్ణోయ్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -