Saturday, May 4, 2024
- Advertisement -

హైదరబాద్ లో గోవా బ్యాచ్.. నైజీరియన్‌ డ్రగ్స్..!

- Advertisement -

ఖైరతాబాద్ ఎమ్​ఎస్​ మక్తాలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. 153 గ్రాముల కొకైన్, 16 గ్రాముల ఎమ్​డీఎమ్​ఏను స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న నైజీరియన్‌ జేమ్స్ మోరిసన్‌ను అరెస్ట్‌ చేశారు. ఎమ్​ఎస్​ మక్తాలో నివాసం ఉంటున్న నైజీరియన్ జేమ్స్ మోరిసన్ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.

నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని నుంచి ఫోన్, డ్రగ్స్ సరఫరా వివరాలు రాసుకున్న నోట్‌బుక్, తూకం పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు.మాదకద్రవ్యాల కేసులో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో అధికారులు కీలక విషయాలు రాబట్టారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్‌కు పలు ముఠాలతో సంబంధాలు ఉన్నాయని నిర్ధరించారు. బెంగళూరు, గోవా ముఠాలతో మోరిసన్‌కు సంబంధాలున్నాయని గుర్తించారు.

బెంగళూరు ముఠా జేమ్స్ మోరిసన్‌ను ఏజెంట్‌గా నియమించింది. బెంగళూరు ముఠాలో డాడీబాయ్, మైక్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వాట్సప్ కాల్స్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. మరి కొందరికి నేరుగా డ్రగ్స్‌ అందజేస్తున్నారు. నైజీరియన్ మోరిసన్ గతంలోనూ డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వెల్లడించారు.

ఈ పెయింటింగ్ ఖ‌రీదు రూ.450 కోట్లు !

థియేటర్లు మూసివేసేది లేదు : మంత్రి తలసాని

వామ్మో ఈ మూడు పండ్లు తిన్నారో మీ ప‌ని అంతే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -