Thursday, April 25, 2024
- Advertisement -

ఈ పెయింటింగ్ ఖ‌రీదు రూ.450 కోట్లు !

- Advertisement -

ఈ పెయింటింగ్ మాములు పెయింటింగ్ కాదు ! ప‌లు రికార్డుల‌ను తిర‌గ‌రాసిన పెయింటింగ్ ఇది ! ప్ర‌ప‌చంలోనే అత్యంత ఖ‌రీదైన పెయింట్ ల‌లో ఒక‌టి. అలాగే, అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ ల‌లో ఒక‌టి. గిన్నీస్ బుక్‌లోనూ చోటు సంపాదించుకుంది. అలాంటి అద్భుత‌మైన పెయింటింగ్ కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందా !

ప్ర‌పంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ గా పేరొందిన దీనిని బ్రిటిష్ క‌ళాకారుడు స‌చా జాఫ్రీ వేశాడు. ఈ పెయింటింగ్‌ను తాజాగా దుబాయ్‌లో వేలం పాట వేశారు. వేలంపాట‌లో రికార్డు స్థాయిలో దాదాపు రూ.450 కోట్ల‌కు ( 62 మిలియన్ డాల‌ర్లకు) అమ్ముడుపోవ‌డం విశేషం. స‌చా జాఫ్రీ దీనిని ‘ద జర్నీ ఆఫ్ హ్యుమనిటీ’ పేరిట కళాఖండంగా మార్చారు. ఈ పెయింట్ వేయ‌డం కోసం ఏకంగా 1,065 పెయింట్ బ్రష్‌లు, 6,300 లీటర్ల పెయింట్స్ ను వాడామ‌ని స‌చా జేఫ్రీ వెల్ల‌డించారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కాలంలో త‌న పూర్తి సమయాన్ని ఈ పెయిటింగ్ వేయ‌డానికి వినియోగించాడ‌ట జేప్రీ. దుబాయ్ లోని అట్లాంటీస్ హోట‌ల్ లో సుమార్ ఏడు నెల‌లకు పైగా క‌ష్ట‌ప‌డి ఈ పెయిటింగ్‌ను రూపొందించాడు. 70 పార్ట్స్ గా ఉన్న ఈ పెయిటింగ్ ను వేలం పాట‌లో ఆండ్రీ అబ్దున్ అనే వ్య‌క్తి ద‌క్కించుకున్నారు. ఈ పెయింటింగ్ ద్వారా స‌మ‌కూరిన డబ్బును క‌రోనా కొర‌ల్లో చిక్కుకున్న పిల్ల‌ల కోసం వినియోగించ‌నున్న‌ట్టు తెలిసింది.

త‌మిళ‌నాడు ఎన్నిక‌లు.. ఓట‌ర్ల దుస్తులు ఉతికిన అభ్యర్థి

రెచ్చిపోయిన మావోయిస్టులు.. ఐదుగురు జవాన్ల మృతి

తెలంగాణ‌లో క‌రోనా పంజా.. రేవంత్ రెడ్డికి పాజిటివ్ !

మెగాస్టార్ దూకుడు.. సోనాక్షితో రోమాన్స్ !

ఏపీ మంత్రులకు హైకోర్టు నోటీసులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -