- Advertisement -

బస్సులో ప్రయాణీకురాలి నుండి బంగారం చోరి!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ బ్యాగ్ నుంచి 15 తులాల బంగారం దొంగిలించబడిన ఘటన కలకలం రేపింది.బాధితురాలు శ్రీదేవి పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె కమలాపురం వద్ద బస్సులో ఎక్కి ప్రొద్దుటూరు, కోగటం మార్గంగా కడపకు ప్రయాణిస్తోంది. బస్సు పాపాగ్ని నది పరిసర ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

కండక్టర్‌కు చూపేందుకు శ్రీదేవి తన హ్యాండ్‌బ్యాగ్ నుంచి ఆధార్ కార్డు తీసే సమయంలో, అదే అవకాశంగా గుర్తు తెలియని దొంగలు ఆమె బ్యాగ్‌లో ఉన్న సుమారు 15 తులాల బంగారు ఆభరణాలను చాకచక్యంగా అపహరించినట్లు పోలీసులు తెలిపారు.

కొద్దిసేపటికే దొంగతనం జరిగిన విషయం గుర్తించిన శ్రీదేవి బస్సులోనే ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన డ్రైవర్ వెంటనే బస్సును కమలాపురం పోలీస్ స్టేషన్‌కు మళ్లించారు.

పోలీసులు ప్రయాణికులందరినీ బస్సు నుంచి దింపించి వారి సామాన్లను తనిఖీ చేశారు. అయితే దొంగిలించిన బంగారం లభించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రజలు రద్దీ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నప్పుడు తమ విలువైన వస్తువులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -