- Advertisement -

అంతర్రాష్ట్ర శిశు విక్రయాల ముఠా అరెస్ట్

- Advertisement -

తెలంగాణలో అంతర్రాష్ట్ర శిశు విక్రయాల ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ ప్రాంతంలో ఐవీఎఫ్ సెంటర్లకు ఎగ్ డోనర్లను సరఫరా చేస్తూ, అధిక డబ్బుల కోసం శిశు విక్రయ దందాలోకి దిగారు నాగరాజు అలియాస్ మురుగన్ అనే వ్యక్తి.

ఈ నెల 6వ తేదీన గుజరాత్ రాష్ట్రంలో దేవ్ అనే బాలుడిని కిడ్నాప్ చేశారు మురుగన్. దేవ్ కిడ్నాప్ కేసును దర్యాప్తు చేస్తూ, ఈ కిడ్నాప్ వెనుక తెలంగాణకు చెందిన ముఠా ఉన్నట్లు గుర్తించి మురుగన్(నాగరాజు)ను అదుపులోకి తీసుకున్నారు గుజరాత్ పోలీసులు.

సంతానం లేని దంపతులకు రూ.5 లక్షలకు శిశువులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -