కుల వివక్షకు ఓ ప్రేమజంట బలైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, బలవంతంగా ఇంటికి తీసుకొచ్చారు పెద్దలు.దీంతో మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో ఒకరినొకరు ప్రేమించుకుని, వివాహం చేసుకుని హైదరాబాద్ వలస వెళ్లారు అనుముల రాకేష్ రెడ్డి(25), తరిగొప్పుల హారిక(22).
పెళ్లైన మూడు నెలలకు స్వగ్రామానికి తీసుకువచ్చి, కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి అంగీకరించలేదు రాకేష్ రెడ్డి తల్లిదండ్రులు. దీంతో ఇటీవల హారిక ఆత్మహత్యాయత్నం చేయగా, రాకేష్ రెడ్డి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు.
కౌన్సిలింగ్ అనంతరం పెళ్లి చేస్తామని చెప్పినా, కావాలనే ఆలస్యం చేస్తున్నారని, వీళ్లు పెళ్లి చేయరని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు రాకేష్ రెడ్డి. ప్రియుడి మరణ వార్త విని తట్టుకోలేక, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది హారిక.దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
