Saturday, May 4, 2024
- Advertisement -

ముత్తూట్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జార్జ్‌ ముత్తూట్‌ కన్నుమూత..!

- Advertisement -

ముత్తూట్ ఫైనాన్స్ వ్యాపార సామ్రాజ్యాధినేత ఎంజీ జార్జ్ ముత్తూట్ జీవితం విషాదకర రీతిలో ముగిసింది. తన నివాసంలో మెట్ల మీద నుంచి కాలు జారి పడి మరణించారు. ముత్తూట్ కుటుంబంలో ఆయన మూడోతరానికి చెందిన వ్యాపారవేత్త. ప్రస్తుతం ఆయన ముత్తూట్ గ్రూప్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన పూర్తి పేరు మత్తయ్య జార్జ్ జార్జ్ ముత్తూట్. ఆయన సారథ్యంలో ముత్తూట్ ఫైనాన్స్ దేశంలోనే గోల్డ్ లోన్ ఇచ్చే అతిపెద్ద సంస్థగా అభివృద్ధి చెందింది. జార్జ్ ముత్తూట్ ఆకస్మిక మరణంపై పలువురు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు స్పష్టతనిచ్చారు. శుక్రవారం (మార్చి 5) రాత్రి ఆయన తన నివాసంలో మెట్ల పైనుంచి పడ్డారని తెలిపారు.

నాలుగో అంతస్తు నుంచి కిందపడటం వల్లే ఆయన మృతి చెందారని వెల్లడించారు. ఆయన మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. 1949 నవంబరులో కేరళలోని పఠనమిట్ట జిల్లాలోని కోజెన్‌చేరిలో జార్జ్ ముత్తూట్ జన్మించారు. ఈయనకు భార్య సారా జార్జ్‌, ఇద్దరు కుమారులు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌‌ జార్జ్‌ ఎం.జార్జ్‌, గ్రూప్‌ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ జార్జ్‌ ఉన్నారు. ముత్తూట్‌ గ్రూప్‌ ఛైర్మన్‌గా ఆయన కుటుంబంలో మూడో తరానికి చెందిన వారు జార్జ్‌.

1979లో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న ఆయన 1993లో గ్రూప్‌ ఛైర్మన్‌గా మారారు. వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తూనే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు జార్జ్ ముత్తూట్. ఫిక్కీ జాతీయ కార్యవర్గ కమిటీలో సభ్యుడిగా, ఫిక్కీ కేరళ రాష్ట్ర కౌన్సిల్‌ ఛైర్మన్‌గానూ జార్జ్‌ ముత్తూట్‌ వ్యవహరిస్తున్నారు. జార్జ్ ముత్తూట్ హఠాన్మరణం పట్ల వ్యాపార వర్గాలు దిగ్భాంతి వ్యక్తం చేశాయి.

ఇంగ్లాండ్ ని మట్టికరిపించిన టీమ్‌ఇండియా.!

అక్కడే దిక్కు లేదు.. ఇక్కడ కడతారు అంట: కేటీఆర్

రవిచంద్రన్​ అశ్విన్​ అరుదైన ఘనత..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -