- Advertisement -

ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా

- Advertisement -

అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించేందుకు వెళ్లిన ముగ్గురు గిరిజన బాలికల సరదా ప్రయాణం విషాదాంతమైంది. సెల్ఫీ కోసం ప్రయత్నించిన క్షణాల్లోనే ప్రమాదం సంభవించి, ముగ్గురు యువతులు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని మిగిల్చింది.

ఈ దుర్ఘటన అనంతగిరిలోని వాటర్‌ఫాల్ వద్ద చోటు చేసుకుంది. సరదాగా జలపాతం చూడటానికి వెళ్లిన నలుగురు యువతులు అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక యువతి ప్రమాదవశాత్తూ జారిపడి నీటి గుంతలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మిగతా ముగ్గురు కూడా ఒక్కొక్కరిగా జారి గెడ్డలో పడిపోయారు.

ఈ ఘటన చాలా వేగంగా జరిగిపోవడంతో, ఎవరికీ స్పందించే అవకాశం లేకపోయింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే జలపాతంలోకి దిగి యువతులను బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఎంతో కష్టపడి వారిని బయటకు తీసినప్పటికీ, అప్పటికే ముగ్గురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో త్రిష,రత్నకుమారి, పవిత్ర మృతి చెందగా మరో యువతి అంజలి గాయాలతో బయటపడింది. మొత్తంగా, ఒక చిన్న నిర్లక్ష్యం మూడు ప్రాణాలను బలితీసుకుంది. ప్రకృతిని ఆస్వాదించాలి కానీ, ప్రాణాల కంటే సరదా పెద్దది కాదని ఈ ఘటన స్పష్టంగా చెబుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -