తెలంగాణలోని జగిత్యాల పట్టణంలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై యువతి బంధువులు కత్తులు, రాళ్లతో దాడి చేసిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న సఖి సెంటర్ సమీపంలో ఈ దాడి చోటుచేసుకుంది.
దాడికి గురైన అనిల్ కుమార్ అనే యువకుడు, తనకు యువతి బంధువుల నుంచి ప్రాణహాని ఉందని ముందుగానే మల్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే సరైన భద్రత కల్పించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. యువతిని తీసుకెళ్లేందుకు వచ్చిన బంధువులు అనిల్‌పై దాడి చేయగా, అతనికి తల, చేయి, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి.
జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడగా ఐదు రోజులుగా సఖి సెంటర్‌లో ఉంటున్న యువతిని తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కులాంతర వివాహమే దాడికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
