Saturday, May 4, 2024
- Advertisement -

కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు కదిలిన సినీ తారలు..

- Advertisement -

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. మూడు నుంచి నాలుగు వేల వరకు మరణాలు సంబవిస్తున్నాయి. కరోనా కేసులు మహరాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు తో పాటు ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు లో కరోనా బాధితులను ఆదుకోవాలని సినీ తారలకు పిలుపు ఇచ్చారు ముఖ్యమంత్రి స్టాలిన్. ఆ ఒక్క పిలుపుతో తమిళ సినీ పరిశ్రమ కదిలి వస్తోంది.

ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు భారీగా అందిస్తున్నారు. మొన్న అగ్ర నటులు సూర్య, సోదరుడు కార్తీ, తండ్రి, నటుడు శివ కుమార్‌తో కలిసి ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి రూ.కోటి విరాళం ఇచ్చి ప్రభుత్వానికి తోడుగా నిలిచారు. ఇక ముఖ్యమంత్రి తనయుడు, ఎమ్మెల్యే, యువ నటుడు ఉదయనిధి స్టాలిన్‌ రూ.25 లక్షలు చెక్కు తన తండ్రికి ఇచ్చాడు. ప్రముఖ నటుడు అజిత్‌ రూ.25 లక్షల సహాయం చేశాడు. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు.

సీఎం ఎంకే స్టాలిన్‌ను కలిసి చెక్ అందించారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య సీఎం స్టాలిన్‌ను కలిసి రూ.కోటి విరాళం అందించారు. భర్త విశాగన్‌ వనంగముడి, మామ ఎస్‌ఎస్‌ వనంగముడితో కలిసి ఆ విరాళం అందించారు. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కూడా అమల్లో ఉండగా, మరికొన్ని చోట్ల కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి.

ముస్లిం సోదర సోదరీమణులకు బాలయ్య శుభాకాంక్షలు

కరోనాతో ప్రముఖ దర్శకుడు, రచయిత కన్నుమూత

నేటి పంచాంగం, శుక్రవారం(14-05-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -