Wednesday, May 29, 2024
- Advertisement -

మరో షాక్…ఫైబర్ నెట్‌ వర్క్‌ స్కాంలో ఏ1గా బాబు

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో జైలు శిక్ష అనుభవిస్తున్న బాబుపై మరో బాంబు పడింది. ఏపీ ఫైబర్ నెట్ వర్క్ స్కాంలో టీడీపీని ప్రధానముద్దాయిగా పేర్కొంటూ పీటీ వారెంట్ దాఖలు చేసింది సీఐడీ. ఇక ఈ కేసును విచారణకు స్వీకరించింది న్యాయస్ధానం. 2021లో ఫైబర్ నెట్ స్కాంపై కేసు నమోదుకాగా రూ.121 కోట్లు గల్లంతు అయ్యాయని పేర్కొంది. ఈ కేసులో సిట్ విచారణ జరుగుతోంది. టెర్రా సాఫ్ట్‌ అనే కంపెనీకి అక్రమంగా టెండర్లు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి.

దీంతో ఈ కేసులో చంద్రబాబును ఏ1వ చేర్చింది సీఐడీ. పిటిషన్ విచారణకు రానుండటంతో చంద్రబాబుకు మరిన్ని చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. ఇక ఫైబర్ నెట్ వర్క్ స్కాంలో ఇప్పటికే నారా లోకేష్ పేరును సీఐడీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. త్వరలో ఆయన్ని కూడా విచారిస్తామని వెల్లడించారు.

ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ…పక్కా సాక్ష్యాధారాలతో చంద్రబాబే కుట్రదారని నిరూపిస్తూ చార్జీషిట్ దాఖలు చేసింది. చంద్రబాబు తరపు న్యాయవాదులు లేవనెత్తిన ప్రతి అంశానికి స్పష్టంగా కౌంటర్‌ ఇచ్చారు ఏఐజీ సుధాకర్.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం, పైబర్ నెట్ స్కాంతో పాటు 8 పీటీ వారెంట్‌లు దాఖలు చేసింది సీఐడీ. ఓ వైపు చంద్రబాబు బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తుండగా మరోవైపు సీఐడీ అంతకు ధీటుగా బాబు చుట్టు ఉచ్చు బిగిస్తోంది. ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్ట్ అయ్యేలా పక్కా ప్లాన్‌తో వెళ్తోంది సీఐడీ. దీంతో బాబు మరికొన్ని రోజులు లేదా ఏపీలో ఎన్నికలు ముగిసేవరకు జైలులో ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -