Sunday, May 12, 2024
- Advertisement -

ఆ అమాత్యులు పార్లమెంట్‌కే..జగన్ సరికొత్త వ్యూహం?

- Advertisement -

టార్గెట్ రెండోసారి..ఇది వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ ముందున్న ప్రధాన లక్ష్యం. అందుకే ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నా ఇప్పటినుండే దూకుడు పెంచారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇప్పటికే గెలుపు గుర్రాల కసరత్తు పూర్తిచేశారు జగన్. ఇక ఈ సారి అసెంబ్లీ బరిలో కొంతమంది సీనియర్ నాయకుల తనయులు రంగంలోకి దిగుతుండగా పార్లమెంట్ సీట్లలో మంత్రులను పోటీచేయించే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

ప్రధానంగా టీడీపీకి ప్రాతినిధ్యం ఉన్న మూడు ఎంపీ స్థానాలపై ఫోకస్ పెట్టిన జగన్‌…టీడీపీకి కంచుకోటగా ఉన్న శ్రీకాకుళంను ఫస్ట్ టార్గెట్ చేశారు. ఈ స్థానం నుండి ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు రెండు సార్లు ఎంపీగా గెలవగా ఈసారి ఆయనకు ధర్మాన ప్రసాదరావు రూపంలో చెక్ పెట్టాలని భావిస్తున్నారట. అందుకే వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రసాదరావు పేరును దాదాపు ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది.

అలాగే అనకాపల్లి ఎంపీ స్థానానికి మంత్రి గుడివాడ అమరనాధ్ పేరుని పరిశీలిస్తున్నారట. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణను రాజమండ్రి ఎంపీగా కాకినాడ పార్లమెంట్‌కు మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మంత్రి జోగి రమేష్‌ని ఏలూరు లేదా విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. విజయవాడ నుండి కేశినేని నాని రెండు సార్లు ఎంపీగా గెలవగా ఈసారి ఆయనకు చెక్ పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. నరసారావు పేట నుండి మంత్రి విడుదల రజనీ, కర్నూల్ నుండి మంత్రి గుమ్మలూరి జయరాం,హిందూపురం నుండి మంత్రి ఉషశ్రీ చరణ్ బరిలోకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉండగా సగం మంత్రులు ఎంపీలుగా పోటీ చేస్తారనే ప్రచారం మాత్రం జోరందుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -