ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభలో కీలక మార్పులు చేసింది. పార్టీ రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాఘవ్ చద్దా స్థానంలో అశోక్ కుమార్ మిట్టల్‌ను నియమిస్తూ రాజ్యసభ సచివాలయానికి అధికారికంగా లేఖ పంపింది.
ఈ నిర్ణయం రాబోయే పార్లమెంట్ సమావేశాల ముందు పార్టీ అంతర్గత నాయకత్వ మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు. ఆప్‌కు ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 10 మంది సభ్యులు ఉండగా వీరిలో 7 మంది పంజాబ్ నుంచి, 3 మంది ఢిల్లీ నుంచి ఉన్నారు.
ఈ మార్పుపై అశోక్ కుమార్ మిట్టల్ స్పందిస్తూ ఇది సాధారణ ప్రక్రియ మాత్రమే…. నా ముందు ND గుప్తా ఈ బాధ్యతలు నిర్వహించారు అని తెలిపారు. రాఘవ్ చద్దా.. పార్టీ మారుతున్నారన్న వార్తలపై స్పందిస్తూ, అలాంటి కారణం ఏమీ లేదని స్పష్టం చేశారు. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన రాఘవ్ చడ్డా, 2012లో AAP స్థాపన నుంచి పార్టీతో ఉన్నారు. ఆయనను అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడిగా భావిస్తారు.
ఆప్..పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.ఢిల్లీ జల్ బోర్డు ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు.పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు సలహాదారుగా కూడా పనిచేశారు
