టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని అసలు మనిషిగా కూడా చూడను. రాజీనామా చేయమని అడిగే వాడిని అయితే నీ దగ్గరకు ఎందుకు వస్తాను? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉపయోగించిన పదజాలంపై సమాజానికి క్షమాపణలు చెబుతున్నానని చెప్పినా…బీఆర్ నాయుడు ఆ పదవికి తగిన వ్యక్తి కాదని స్పష్టం చేశారు.
అలాగే, పవిత్రమైన దేవాలయంలో అనుచిత చర్యలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేశారు. 2019లో ఇందులేఖ అనే బ్రాహ్మణ మహిళ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖను కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు. ఆ లేఖలో బీఆర్ నాయుడుపై చేసిన ఆరోపణలను చదివి వినిపించారు.
భయంకరమైన ఉమెనైజర్ అంటూ వ్యక్తిగత విమర్శలు గుప్పించిన భూమన, ఇలాంటి వ్యక్తిని ఆ పదవిలో ఉంచడం ఉద్దేశపూర్వకమేననే అనుమానం వ్యక్తం చేశారు. తనపై అవమానకరంగా మాట్లాడుతున్నారని, అయితే అలాంటి ఆరోపణలను తాను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
పవిత్రమైన దేవాలయంలో పాడు పనులు చేసే నీచాతి నీచుడు…. భర్తను కోల్పోయిన బ్రాహ్మణ మహిళ చంద్రబాబుకు ఉత్తరం రాసినా పట్టించుకోలేదు అన్నారు.చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా బీఆర్ నాయుడు లాంటి నీచుడిని ఉంచారనే అనుమానం కలుగుతోంది…నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు మాపై అరేయ్.. తురేయ్ అని మాట్లాడుతున్నాడు నీలాంటి చప్రాసి, లఫంగుల గురించి మేము ఆలోచన చేయటమా..? అని అనుకున్నాం అన్నారు. టీటీడీ ఛైర్మన్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
