- Advertisement -
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. నకిరేకల్ పీఎస్‌లో నమోదైన 3 ఎఫ్ఐఆర్‌లను క్వాష్ చేసింది హైకోర్టు. నకిరేకల్‌లో 10వ తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో ఎమ్మెల్యే వీరేశం అనుచరుల పాత్రపై కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని, తప్పుడు సమాచారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుతో కేటీఆర్‌పై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు పోలీసులు. ఈ 3 ఎఫ్ఐఆర్‌లపై ఆధారాలు లేవని కొట్టేసింది హైకోర్టు.
ఈనెల 21న నకిరేకల్ పట్టణంలో జరిగిన 10వ తరగతి తెలుగు పేపర్ లీక్ విషయంలో 13 మంది కేసు నమోదు చేయగా 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుల వివరాలు బైటపెట్టినందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద 3 సెక్షన్ (1) కింద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు.
