బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసిందిబీజుఏపీ . 71 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి, డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయి నుంచి, మంత్రి నితిన్ నబిన్ బంకిపూర్ నుంచి, రేణు దేవి బెట్టియా నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపింది.
మాజీ కేంద్ర మంత్రి, ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు సన్నిహితుడైన రామ్‌కృపాల్ యాదవ్‌ను దానాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. అసెంబ్లీ స్పీకర్ నంద్ కిశోర్ యాదవ్ పేరు ఈ జాబితాలో లేదు. ఆయన 2010 నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పట్నా సాహిబ్ స్థానంలో, బీజేపీ రత్నేష్ కుశ్వాహాను అభ్యర్థిగా నిలబెట్టింది.
పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తర్కీశోర్ ప్రసాద్ కతిహార్ నుంచి పోటీ చేస్తుండగా, ఆరోగ్య మంత్రి మంగళ పాండే సివాన్ నుంచి, రోడ్డు నిర్మాణ మంత్రి నితిన్ నబీన్ బ్యాంకిపూర్ నుంచి పోటీ చేయనున్నారు. కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత అయిన ష్రేయసి సింగ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆమె గత ఎన్నికల్లో గెలిచిన జముయి స్థానంలోనే మళ్లీ బరిలోకి దిగుతున్నారు.
ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి పోటీ చేస్తున్న తారాపూర్ నియోజకవర్గం 2010 నుండి జేడీయూకు చెందింది. అంతకుముందు ఈ నియోజకవర్గాన్ని ఆయన తండ్రి శకుని చౌధరి ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీలో ఉన్నారు.
