ఐపీఎల్ మినీ యాక్షన్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా క్యామరన్ గ్రీన్ నిలిచాడు. మరోవైపు లియమ్ లివింగ్‌స్టోన్, రచిన్ రవీంద్ర వంటి స్టార్ ఆటగాళ్లు అమ్ముడుపోకపోగా, గతేడాది భారీ ధరకు వెళ్లిన వెంకటేశ్ అయ్యర్‌ను ఈసారి ఆర్‌సీబీ రూ.7 కోట్లకే దక్కించుకుంది.
క్వింటన్ డికాక్ (బేస్ ధర రూ.1 కోటి) – ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.
కేఎస్ భరత్ (రూ.75 లక్షలు) – అమ్ముడుపోలేదు.
దీపక్ హుడా (రూ.75 లక్షలు) – అమ్ముడుపోలేదు.
వెంకటేశ్ అయ్యర్ – ఆర్‌సీబీకి రూ.7 కోట్లకు చేరాడు.
వానిందు హసరంగ (రూ.2 కోట్లు) – లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు.
లియమ్ లివింగ్‌స్టోన్, రచిన్ రవీంద్ర – అమ్ముడుపోలేదు.
గస్ అట్‌కిన్సన్ – అమ్ముడుపోలేదు.
అమ్ముడుపోని ఆటగాళ్లు (ఇప్పటివరకు): జేక్ ఫ్రేసర్–మెక్‌గర్క్, పృథ్వీ షా, డెవన్ కాన్వే, సర్ఫరాజ్ ఖాన్
క్యామరన్ గ్రీన్‌కు రూ.25.20 కోట్లు కాదు, రూ.18 కోట్లే ఎందుకు అంటే..నిబంధనల ప్రకారం, రూ.18 కోట్లకు మించిన మొత్తం బీసీసీఐకి వెళ్లి ఆటగాళ్ల సంక్షేమానికి వినియోగిస్తారు. అయితే యాక్షన్ పర్స్ నుంచి మాత్రం మొత్తం రూ.25.20 కోట్లు కట్ అవుతాయి. ఈ పరిమితి విదేశీ ఆటగాళ్లకే వర్తిస్తుంది. భారత ఆటగాళ్లకు పూర్తి బిడ్ మొత్తం చెల్లిస్తారు.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్–6 ఆటగాళ్లు:
రిషభ్ పంత్ – ₹27 కోట్లు
శ్రేయాస్ అయ్యర్ – ₹26.75 కోట్లు
క్యామరన్ గ్రీన్ – ₹25.20 కోట్లు
మిచెల్ స్టార్క్ – ₹24.75 కోట్లు
వెంకటేశ్ అయ్యర్ – ₹23.75 కోట్లు
పాట్ కమిన్స్ – ₹20.5 కోట్లు
ఇతర ముఖ్య కొనుగోళ్లు:
డేవిడ్ మిల్లర్ (రూ.2 కోట్లు) – ఢిల్లీ క్యాపిటల్స్‌కు దక్కాడు.
