ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఇక న్యాయస్థానం విధించిన ఆంక్షలు ఈ నెల 29తో ముగియనుండగా తన తర్వాతి కార్యాచరణపై దృష్టి సారిస్తున్నారు చంద్రబాబు. ఇక ప్రధానంగా ఈసారి నేరుగా జనంలోకి వెళ్లకుండా టెంపుల్ రన్ అంటే దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయనున్నారట.
ఈ నెల 30న చంద్రబాబు తిరుపతికి చేరుకోనున్న చంద్రబాబు డిసెంబరు 1న శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 2న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత వరుసగా సింహాచలం క్షేత్రం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఇలా టెంపుల్ రన్ పూర్తయిన తర్వాత జనంలోకి వెళ్లనున్నారని సమాచారం.
ఇక చంద్రబాబు జనంలోకి వచ్చిన తొలి సభకు భారీ జనసమీకరణకు ప్లాన్ చేయనున్నారని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు ఒక ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్తున్నారట. నేరుగా ప్రజల్లోకి వెళ్లడం కంటే దేవాలయాల చుట్టు తిరగడం వలన సింపతి మరింత పెరుగుతుందని భావిస్తున్నారట.
ఆధ్యాత్మిక యాత్ర తర్వాత పూర్తిగా రాజకీయాలపైనే చంద్రబాబు దృష్టి ఉండనున్నట్లు ఆ పార్టీ నేతల సమాచారం. డిసెంబర్ రెండోవారం నుండి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి బాబు ఎంటర్ కానుండగా ఆయన వ్యూహాలు ప్రజలను ఏ మేరకు ఆకట్టుకుంటాయో వేచిచూడాలి.
