Friday, May 3, 2024
- Advertisement -

చంద్రబాబా..మజాకా..కమ్మదనం ఉట్టిపడేలా!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన తొలి జాబితాపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా ఆపార్టీ నేతలే దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి నెలకొంది. టీడీపీ అంటే కమ్మ పార్టీ అని రుజువు చేసేలా ఆ సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు చంద్రబాబు. కేవలం నాలుగు శాతం ఓట్లున్న కమ్మ సామాజిక వర్గానికి 21 సీట్లు కేటాయించి తన ప్రేమను చాటుకునున్నారు చంద్రబాబు. దీంతో టీడీపీ అంటేనే బీసీ వ్యతిరేకి, కమ్మ సామాజికవర్గా అనుకుల పార్టీ అని మరోసారి నిరూపితమైందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కమ్మలకు 21 సీట్లు లభించగా, రెడ్డి సామాజిక వర్గానికి 17 సీట్లు ఇచ్చారు. అయితే మైనార్టీలకు మాత్రం కేవలం ఒకే ఒక సీటును కేటాయించారు. 45 % జనాభా ఉన్న బీసీలకు 18 సీట్లే ఇచ్చారు. మైనారిటీలకు ఒకే ఒక్క సీటు ఇచ్చి మమా అనిపించగా 4% జనాభా ఉన్న కమ్మలకు మాత్రం 21 సీట్లు ఇచ్చారు.

తొలి లిస్ట్‌లో జనసేనకు 24 స్థానాలు కేటాయించడంతో ఇక మిగిలింది 57 స్థానాలే. ఇందులో బీజేపీకి నాలుగు లేదా ఐదు స్థానాలు కేటాయిస్తే మిగిలిన వాటిలో కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా కమ్మలపై తన ప్రేమను మరోసారి చంద్రబాబు నిరూపించుకున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్న పరిస్థితి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -