Friday, May 3, 2024
- Advertisement -

కొడాలికి చెక్ పెట్టడం సాధ్యమేనా!

- Advertisement -

కొడాలి నాని..ఏపీ రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక శైలీ. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం నాని ప్రత్యేకత. టీడీపీ నుండి రాజకీయ ఆరంగేట్రం చేసినా తర్వాత ఆ పార్టీ అధినేత చంద్రబాబును విభేదించి వైసీపీలో చేరి మంత్రిగా పనిచేశారు. ఇక గుడివాడ రాజకీయాల్లో నాని స్టైలే వేరు. 2004 నుండి ఓటమి ఎరుగని నేత.2004,2009లో టీడీపీ నుండి గెలుపొందిన నాని తర్వాత వైసీపీలో చేరి 2014,2019లో వరసుగా నాలుగు సార్లు విజేతగా గెలిచారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రిగా పనిచేశారు.

జగన్‌ కోటరిలో ఒకడిగా పేరు తెచ్చుకున్న నాని..ఆయనపై ఈగ వాలిన సహించరు. జగన్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన స్పందించే వారిలో ముందుంటారు నాని. ప్రధానంగా చంద్రబాబు, లోకేష్‌పై నాని చేసే విమర్శలు మరెవ్వరూ చేయలేరు. ఎందుకంటే ఆయన మాటలు వారిని అంతలా గుచ్చుకుంటాయి. అందుకే టీడీపీ నేతలు, చంద్రబాబుకు నాని టార్గెట్‌గా మారారు.

ఈసారి టార్గెట్ గుడివాడగా పావులు కదుపుతున్నారు చంద్రబాబు. అందుకే అప్పటివరకు ఇంఛార్జీగా ఉన్న రావి వెంకటేశ్వరరావును తప్పించి వెనిగళ్ల రామును కొత్త ఇంఛార్జీగా నియమించారు.ఇక రావి వర్గాన్ని బుజ్జగించేందుకు ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని హామీ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్న కొడాలిని ఓడించడం సాధ్యామా అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే ప్రజల మద్దతు కొడాలి నాని వైపే ఉంది. ఇందుకు నిదర్శనమే ఇప్పటివరకు ఓడిపోలేదు నాని. తనదైన శైలీలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. అందుకే గుడివాడలో నానిని ఓడించడం అంత ఈజీ కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -