- Advertisement -

మాజీ సీఎం కేసీఆర్‌పై చార్జిషీట్?

- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంటున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉందని రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చ జరుగుతోంది. దర్యాప్తు సంస్థలు ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం. వారం రోజుల్లో అడిషనల్ చార్జిషీట్ దాఖలు చేసే దిశగా కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే సంతోష్ రావుల పాత్రపై పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలతో నేరాభియోగాలు నమోదు చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్‌కు అనుమతులు ఇచ్చిన రివ్యూ కమిటీకి సంబంధించిన అంశాలపై దర్యాప్తు వేగం పెరిగింది. ట్యాపింగ్‌కు అనుమతిచ్చిన రివ్యూ కమిటీ అధికారులను సాక్షులుగా పేర్కొనే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

పక్కా ఆధారాలతోనే చార్జిషీట్ దాఖలు చేయాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కీలకమైన డాక్యుమెంట్లు, కాల్ డేటా రికార్డులు, అధికారుల వాంగ్మూలాలను సేకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ కేసులో ఓ ఐఏఎస్ అధికారి అప్రూవర్‌గా మారినట్టు టాక్ వినిపిస్తోంది. ఆయన వాంగ్మూలం కేసుకు కీలకంగా మారే అవకాశముందని అంటున్నారు.

మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా, న్యాయపరంగా కీలక మలుపు తిరిగే దశకు చేరిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -