కాకినాడలో పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని పరోక్షంగా షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై వ్యాఖ్యానించారు జగన్. రానున్న రోజుల్లో కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు జరుగుతాయని…కుట్రలు, కుతంత్రాలు చేస్తారని మండిపడ్డారు.
మోసాలు అబద్దాలతో వస్తారు జాగ్రత్తగా ఉండాలన్నారు సీఎం జగన్. పేదల ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ పవన్ కళ్యాణ్ కేంద్రానికి లేఖ రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నమ్ముకుంది పొత్తులు, ఎత్తులు కుట్రలు కాదని తాను దేవుడిని, ప్రజలనే నమ్ముకున్నానని చెప్పారు.
ఇక కాసేపటి క్రితం తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా సీఎం జగన్‌కు ఆహ్వానించారు షర్మిల. రాజారెడ్డి వివాహా పత్రికను జగన్‌కు అందించారు. ఇక రేపు తన పార్టీ వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారు షర్మిల. కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో హస్తం గూటికి చేరుకోనుండగా ఏపీసీసీ చీఫ్‌గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.
