Monday, May 6, 2024
- Advertisement -

క్రిమినల్ పవన్..జనసైనికులకు షాక్!

- Advertisement -

ఎన్నికలకు సమీపిస్తున్న కొద్ది ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక ఎన్నికల సంగ్రామంలో వైసీపీ దూసుకుపోతుండగా టీడీపీ, జనసేన కూటమికి మాత్రం బాలారిష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే టీడీపీ చీఫ్ చంద్రబాబుపై అవినీతి కేసులు మెడకు చుట్టుకోగా తాజాగా ఏపీ ఫైబర్ నెట్ స్కాం కేసులో చంద్రబాబును ఏ1గా చేర్చుతూ చార్జీషీట్ దాఖలు చేసింది సీఐడీ. తాజాగా పవన్‌కు షాక్‌ తగిలింది.

వాలంటీర్ వ్యవస్థపై జనసేనాని పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో క్రిమినల్ కేసు నమోదైంది. పవన్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం గుంటూరు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఐపిసి 499, 500 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణకు కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ పవన్ కు నోటీసులు జారీచేసింది.ఎన్నికల వేళ ఊహించని ఈ పరిణామంతో పవన్‌ సైతం షాక్ తిన్నారు.

రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ లకు వాలంటీర్లు కారణమని వ్యాఖ్యానించారు పవన్. నిరుపేద, ఒంటరి మహిళల వివరాలు సంఘవిద్రోహ శక్తులకు చేరుతున్నాయని చెప్పారు. పవన్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. పవన్ కు వ్యతిరేకంగా పలు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు వాలంటీర్లు. ఇక ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా విచారణ చేపట్టిన కోర్టు క్రిమినల్ కేసుకు ఆదేశించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -