- Advertisement -

దేవుడే పంపించాడు..కేసీఆర్‌తో జీవన్ రెడ్డి

- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి.

ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుష్పగుచ్ఛం అందించి సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డా. సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ను కలిసిన సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. అన్నా… నన్ను మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపించాడు. తెలంగాణకు నష్టం జరుగుతున్న ఈ సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. చాలా గ్యాప్ తర్వాత మీతో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది అన్నా అంటూ తన మనసులోని భావాలను వ్యక్తం చేశారు.

జీవన్ రెడ్డి మాటలకు స్పందించిన కేసీఆర్…ఆయనను అప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకున్నారు. దుశ్శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య స్నేహపూర్వకంగా చర్చలు కొనసాగాయి. కాసేపు ఇష్టాగోష్టి అనంతరం జీవన్ రెడ్డి బృందాన్ని కేసీఆర్ లంచ్‌కు ఆహ్వానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -