గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీకి షాక్ తగిలింది. గతసారి పది స్థానాలకు గాను పది గెలుచుకున్న టీడీపీకి ఈసారి భంగపాటు తప్పలేదు. క్రాస్ ఓటింగ్ జరగడంతో వైసీపీ ఒక స్థానంలో గెలుపొంది హద్దులు దాటిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పింది వైసీపీ.
అధికార మదంతో ప్రలోభాలు, బెదిరింపులకి దిగిన టీడీపీకి షాకిస్తూ.. జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో ఒక స్థానాన్ని దక్కించుకుంది వైసీపీ. కార్పొరేటర్లను ఏకతాటిపైకి తెచ్చిన విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు. ఏకంగా 18 మంది కూటమికి చెందిన కార్పొరేటర్లు వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పద్మారెడ్డికి ఓటు వేశారు. దీంతో ఒక స్థానాన్ని కొల్పోయింది టీడీపీ.
గతేడాది జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో.. ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. జీవీఎంసీ 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో ఎన్డీఏ కూటమికి 64 మంది కార్పొరేటర్ల మద్దతు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 31 మంది కార్పొరేటర్ల బలం ఉంది. వామపక్షాలకు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. ఒక్కొక్కరికి పది ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీలో పది స్థానాలు ఉన్నాయి. జీవీఎంసీ పాలకవర్గం పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 12తో ముగియనుంది.
